ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బావిలో పడిన బామ్మ.. కాపాడిన పోలీసులు - iold lay fell in a farm well was saved by police

చిత్తూరు జిల్లా అత్తూరులో ఓ వృద్ధురాలు పొరపాటున వ్యవసాయ బావిలో పడిపోయింది. ఘటనపై సమాచారమందుకున్న పోలీసులు అక్కడికి వెళ్లి ఆమె ప్రాణాలు రక్షించారు.

old lady saved from a farmwell
వ్యవసాయబావిలో పడ్డ వృద్ధురాలిని రక్షించిన పోలీసులు

By

Published : May 8, 2021, 4:24 PM IST

వ్యవసాయబావిలో పడ్డ వృద్ధురాలిని రక్షిస్తున్న పోలీసులు...

చిత్తూరు జిల్లా రేణిగుంట మండలం అత్తూరులో ఓ వృద్ధురాలు ప్రమాదవశాత్తు బావిలో పడింది. పొలానికి వెళ్తూ కాలుజారి అక్కడే ఉన్న వ్యవసాయ బావిలో సుబ్బమ్మ (80) పడిపోయింది. ప్రాణాలు కాపాడుకోవడానికి బావిలోని పైపును పట్టుకుని కేకలు వేసింది. ఆమె అరుపులు విని అక్కడకు చేరుకున్నవారు పోలీసులకు సమాచారమిచ్చారు.

ఘటనా స్థలికి చేరుకున్న గాజులమండ్యం కానిస్టేబుళ్లు.. బావిలోకి మంచం దించి తాళ్ల సాయంతో వృద్ధురాలి ప్రాణాలు కాపాడారు. చాకచక్యంగా ప్రాణాలు కాపాడిన కానిస్టేబుళ్లు శివకుమార్, మహేశ్​లను తిరుపతి అర్బన్​ ఎస్పీ అప్పలనాయుడు అభినందిస్తూ రివార్డు ప్రకటించారు.

ABOUT THE AUTHOR

...view details