చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం.. మంగళం పరిధిలో తెదేపా మద్దతు అభ్యర్థుల ఇళ్లల్లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. అనధికారికంగా కర్నాటక మద్యం దాచారన్న అభియోగంతో మంగళంలో తనిఖీలు నిర్వహించిన అలిపిరి పోలీసులు.. అక్రమ మద్యం కేసులో మంగళం, సప్తగిరికాలనీ, రణధీరపురం, తిరుమలనగర్ పంచాయతీల తెదేపా అధ్యక్షుడు ఈశ్వరయ్యను అరెస్ట్ చేశారు. మంగళం సర్పంచి తెదేపా మద్దతు అభ్యర్థి మహేశ్వరి సోదరుడిని అదుపులోకి తీసుకున్నారు. పథకం ప్రకారం మద్యం సీసాలను ఇంటి ఆవరణల పెట్టి పంచాయతీ ఎన్నికల్లో పోటీ లేకుండా చేయాలనే అధికార పార్టీ అభ్యర్థులు ఈ దాడులు చేయించారని తెదేపా మద్దతు అభ్యర్థులు ఆరోపిస్తున్నారు.
తెదేపా మద్దతుదారుల ఇళ్లల్లో పోలీసుల తనిఖీలు - చిత్తూరు జిల్లా వార్తలు
తెదేపా మద్దతుదారుల ఇళ్లలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. అక్రమ మద్యం కేసులో మంగళం, సప్తగిరికాలనీ, రణధీరపురం, తిరుమలనగర్ పంచాయతీల తెదేపా అధ్యక్షుడు ఈశ్వరయ్యను అరెస్ట్ చేశారు. మంగళం సర్పంచి తెదేపా మద్దతు అభ్యర్థి మహేశ్వరి సోదరుడిని అదుపులోకి తీసుకున్నారు.
![తెదేపా మద్దతుదారుల ఇళ్లల్లో పోలీసుల తనిఖీలు Police Rides](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10643522-442-10643522-1613447180297.jpg)
Police Rides
TAGGED:
చిత్తూరు జిల్లా వార్తలు