ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పాకాల వైకాపా నేతపై దాడి చేసింది... సొంత పార్టీ నేతలే! - పాకాల వైకాపా నేతపై దాడి

చిత్తూరు జిల్లా పాకాల వైకాపా నేతపై దాడి చేసిన దుండగులను పోలీసులు పట్టుకున్నారు. రాష్ట్ర వైకాపా సేవాదళ్ కార్యదర్శి కుమారుడే ఈ దాడి చేశాడని పోలీసులు తెలిపారు. మరో ఆరుగురిని అదుపుాలోకి తీసుకున్నారు. సొంతపార్టీలో విభేదాలే ఘటనకు కారణమని వారు పేర్కొన్నారు.

police reveal details on Pakala ysrcp leader  attack
పాకాల వైకాపా నేతపై దాడి

By

Published : Mar 1, 2021, 10:34 AM IST

సొంత పార్టీ నేతపైనే.. రాష్ట్ర వైకాపా సేవాదళ్ కార్యదర్శి కుమారుడు దాడి చేశాడు. ఈ మేరకు పోలీసులు వివరాలు వెల్లడించారు. చిత్తూరు జిల్లా పాకాల మండలం భారతంమిట్టలో ఈ నెల 8న వైకాపా నేత ప్రకాష్ రెడ్డిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేశారు. రాష్ట్ర వైకాపా సేవాదళ్ కార్యదర్శైన నంగా బాబురెడ్డి కుమారుడు నితిన్ అనే వ్యక్తి దాడి చేసినట్టుగా గుర్తించామని.. అతను ఎ-1 అని ఎస్ఐ రాజశేఖర్ తెలిపారు.

మరో ఆరుగురు నిందితులు మురళి, రవితేజ, నాగేంద్ర, గుణశేఖర్, పార్థసారథి, అశోక్​ను సీఐ ఆశీర్వాదం ఆధ్వర్యంలో అరెస్ట్ చేశామని అన్నారు. వారి నుంచి రెండు మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకుని రిమాండ్ నిమిత్తం.. పాకాల కోర్టుకు తరలించారు. ప్రధాన సూత్రధారైన నంగా నితిన్ ప్రస్తుతం పరారీలో ఉన్నట్టు తెలిపారు. త్వరలో అతని కూడా అరెస్టు చేస్తామని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details