చిత్తూరు జిల్లా పాకాల మండలంలో ఇద్దరు యువకులు తృటిలో ప్రమాదం నుంచి బయటపడ్డారు. శనివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి పాకాల-దామల చెరువు వెళ్లే మార్గంలో బ్రిడ్జి వద్ద నీటి ప్రవాహం పెరిగింది. ఇది గమనించని ఇద్దరు యువకులు ఉదయం మూడు గంటల సమయంలో ద్విచక్రవాహనంపై వెళ్తూ అదుపుతప్పి ప్రవాహంలో కొట్టుకుపోయారు. వెనకే వస్తున్న వాహనదారులు పాకాల పోలీసులకు సమాచారం ఇవ్వటంతో పోలీసులు, ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని వారిని రక్షించారు. ప్రవాహంలో కొట్టుకుపోయిన ద్విచక్రవాహనాన్ని సైతం బయటకు తీశారు. బయటకు వచ్చిన యువకులకు అధికారులు కౌన్సిలింగ్ ఇచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు.
వరదలో కొట్టుకుపోతున్న ఇద్దరిని కాపాడిన పోలీసులు - chittoor latest update
ప్రమాదవశాత్తు వరద నీటిలో కొట్టుకుపోతున్న ఇద్దరు వ్యక్తులను చిత్తూరు జిల్లా పాకాల పోలీసులు రక్షించారు. యువకులను అధికారులు కౌన్సిలింగ్ ఇచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు.
వరదలో కొట్టుకుపోతున్న ఇద్దరిని కాపాడిన పోలీసులు