ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నాటుసారా స్థావరంపై దాడులు.. 2000 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం - police raids on illici liquor den

చిత్తూరు జిల్లాలోని రెడ్డి మాన్యం తండా అటవీ ప్రాంతంలో నాటుసారా తయారీ స్థావరాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. 2000 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు.

2000 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం
నాటుసారా స్థావరంపై దాడులు

By

Published : Apr 29, 2021, 10:26 PM IST


చిత్తూరు జిల్లా యర్రావారిపాలెం మండల పరిధిలోని రెడ్డి మాన్యం తండా అటవీ ప్రాంతంలో పోలీసులు దాడులు నిర్వహించారు. నాటుసారా తయారీ స్థావరాలపై మెరుపు దాడులు చేశారు. పోలీసుల రాకను పసిగట్టిన సారా తయారీదారులు స్థావరాలు వదిలి పరారయ్యారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులకు నాటుసారా తయారీ కోసం సిద్ధం చేసిన 2000 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. సారా తయారీకి ఉపయోగించే ముడి సరకులు, డ్రమ్ములను స్వాధీనం చేసుకున్నారు. నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details