ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పోలీసులనే ఆటకు పిలిచిన పేకాటరాయుళ్లు - police raids on chittoor dst gambling centers

పేకాట రాయుళ్లు ఆటమత్తులో పడి... సాధారణ దుస్తుల్లో ఉన్న పోలీసులను కూడా పేకాటకు ఆహ్వానించారు. ఈ సంఘటన చిత్తూరు జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గంలోని పెద్ద తిప్ప సముద్రం మండల పరిధిలో జరిగింది.

police raids on gambling players in chittoor dst
police raids on gambling players in chittoor dst

By

Published : Jul 6, 2020, 10:53 PM IST

చిత్తూరు జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గంలోని పెద్ద తిప్ప సముద్రం మండలం.. ఒడ్డిపల్లె గ్రామం వద్ద పేకాట శిబిరంపై పోలీసులకు సమాచారం అందింది. ఎస్ఐ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో సిబ్బంది సాధారణ దుస్తుల్లో అక్కడికి చేరుకున్నారు.

పోలీసులను గుర్తుపట్టని పేకాట రాయుళ్లు పారిపోకుండా అక్కడే కూర్చుని, కొత్త ఆటగాళ్ళు వచ్చారని ఆహ్వనించారు. పోలీసులు పేకాట ఆడుతున్నవారిని అదుపులోకి తీసుకుని వారి నుంచి 6,050 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details