చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలం చింతలపాలెంలో షికారీలకు రక్షణగా పోలీస్ పికెటింగ్ను ఏఎస్పీ అనిల్ బాబు ఏర్పాటు చేశారు. గత కొన్ని రోజులుగా స్థానిక రైతులకు షికారీలకు వివాదాలు జరుగుతున్నాయి.. ఈ నేపథ్యంలోనే బబ్లీ అనుమానాస్పదంగా మృతి చెందాడు. బబ్లీ రక్తపు మడగులో పడి ఉండటంతో.. హత్యగా కేసు నమోదు నమోదు చేసినట్లు పోలీసులు వివరించారు. దీంతో తిరుపతి ఏఎస్పీ సంఘటనా స్థలాన్ని పరిశీలించి.. గ్రామంలో పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. ప్రత్యేక బృందాలతో త్వరతిగతిన కేసును ఛేదిస్తామనీ.. అప్పటి వరరకు షికారీలకు రక్షణగా పోలీస్ పికెటింగ్ ఉంటుందని వివరించారు.
షికారీలకు రక్షణగా పోలీస్ పికెటింగ్ - చింతలపాలెంలో పోలీస్ పికెట్ న్యూస్
చిత్తూరు జిల్లా చింతలపాలెంలో షికారీలకు పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు. రైతులకు, షికారీలకు వివాదాలు జరుగుతన్న నేపథ్యంలో.. ఓ షికారీ వ్యక్తి హత్యకు గురికావటంతో పోలీసులు ఈ ఏర్పాట్లు చేశారు.
షికారీలకు రక్షణగా పోలీస్ పికెటింగ్