పోలీసుల సమసమాజ సందర్శిని కార్యక్రమం - tirupati
తిరుపతి అర్బన్ జిల్లా పోలీస్ సమ సమసమాజ సందర్శిని కార్యక్రమంలో భాగంగా చంద్రగిరి మండలం ముంగిలిపట్టు ఎస్సీ కాలనీ గ్రామ ప్రజల దాహాన్ని తీర్చారు. తాగు నీటి సమస్యను సత్వరం పరిష్కరించడంలో సఫలీకృతులుయ్యారని సిబ్బందిని, సి. ఐ ని ఎస్పీ అభినందించారు.
తిరుపతి అర్బన్ జిల్లాలోని అన్ని పోలీస్స్టేషన్ల పరిధిలో పోలీసులు ప్రజలకు అందుబాటులో ఉండి, వారి సమస్యలు సత్వరమే తీర్చేందుకు సిద్ధంగా ఉండాలని ఎస్పీ అన్బురాజన్ అన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానంలో భాగంగా సమ సమాజ సందర్శన అనే సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. పోలీస్ వెల్ఫేర్ నిధులతో తాగునీటి సమస్యను తీర్చే ప్రయత్నం చేసారు.పైలెట్ ప్రాజెక్టు కింద చంద్రగిరి మండలం ముంగిలిపట్టు ఎస్సీ కాలనీలో తాగునీటి ట్యాంకు ఏర్పాటు చేశామని తెలిపారు. తమ ప్రయత్నానికి ప్రజల సహకారం కావాలన్నారు. సమస్యను సత్వరం పరిష్కరించిన సీఐ, సిబ్బందిని ఎస్పీ అభినందించారు.