చిత్తూరు డీఎస్పీ ఈశ్వర్‌రెడ్డి ప్రతిష్టాత్మక ఇండియన్ పోలీసు మెడల్‌కు ఎంపికయ్యారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కేంద్రం హోంశాఖ ప్రకటించిన పతకాల్లో విశిష్ట సేవలందించినందుకుగాను ఆయనకు మెడల్ లభించింది. 1989వ బ్యాచ్‌కు చెందిన ఆయన 31 ఏళ్ల సర్వీసులో ఇప్పటివరకు 45 నగదు బహుమతులు...62 రివార్డులు, 30 ప్రశంసాపత్రాలు అందుకున్నారు.
2002లో సేవా పతకము, 2009లో ఉత్తమ సేవా పతకము, 2010లో ముఖ్యమంత్రి శౌర్య పతకము, 2011లో రాష్ట్రపతి నుంచి పోలీస్ శౌర్యపతకం పొందారు. 2019 జులై నెల నుంచి చిత్తూరు డీఎస్పీగా సేవలు అందిస్తున్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ ఈశ్వర్‌రెడ్డికి చిత్తూరు జిల్లా ఎస్పీ సెంథిల్ కుమార్, అడిషనల్ ఎస్పీ మహేష్ అభినందనలు తెలిపారు.