ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నంది విగ్రహం ధ్వంసం కేసు ఛేదన... వెలుగులోకి ఆసక్తికర విషయాలు - Attack on Nandi statue in chittor district news

సంచలనం స్పష్టించిన చిత్తూరు జిల్లాలో నంది విగ్రహం కేసును పోలీసులు ఛేదించారు. 8 మంది నిందితులను సోమవారం మీడియా ముందు ప్రవేశపెట్టారు. గుప్త నిధుల కోసమే నంది విగ్రహాన్ని వీరు ధ్వంసం చేసినట్లు జిల్లా ఎస్పీ సెంథిల్ కుమార్ వెల్లడించారు. అంతేకాకుండా ఈ ముఠా ఇతర ఆలయాల సమచారాన్ని సేకరించిందని వెల్లడించారు.

Attack on Nandi statue
Attack on Nandi statue

By

Published : Sep 30, 2020, 3:30 PM IST

నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న వస్తువులు

చిత్తూరు జిల్లా జీడీ నెల్లూరు మండలం అగరమంగళంలోని ఆంజనేయ స్వామి ఆలయంలో నంది విగ్రహం ధ్వంసం కేసును పోలీసులు ఛేదించారు. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం స్పష్టించిన ఈ కేసులో 8 మంది నిందితులను అరెస్టు చేశారు. బుధవారం చిత్తూరు జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ సెంథిల్ కుమార్ కేసు వివరాలను వెల్లడించారు. గుప్తనిధుల కోసం ఆలయాల్లో విగ్రహాలను ధ్వంసం చేసే అంతర్రాష్ట్ర ముఠాగా వీరిని విచారణలో గుర్తించామన్నారు. ముఠాలో కీలక నిందితుడు సోమశేఖర్​పై గుంటూరు జిల్లా మాచవరం పోలీసు స్టేషన్లోనూ గుప్తనిధుల కేసు ఉన్నట్లు ఎస్పీ తెలిపారు.

నిందితుల వద్ద ఉన్న ఆలయాల ఫొటోలు

గుప్త నిధుల కోసం రాష్ట్రంలోని పలు ప్రాచీన దేవాలయాల సమాచారాన్ని ఈ ముఠా సేకరించింది. చిత్తూరు జిల్లానే కాకుండా, కర్నూలు, అనంతపురం, గుంటూరు జిల్లాల్లో వివిధ ప్రాచీన దేవాలయాల సమచాారాన్ని వీళ్లు సేకరించారు. కేసు దర్యాప్తు కోసం మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశాం. విశ్వసనీయ సమాచారం మేరకు కాణిపాకంలో సంచరిస్తున్న అంతరాష్ట్ర ముఠాని అదుపులోకి తీసుకున్నాం. ముఠా నుంచి గుప్త నిధుల తవ్వకాలకు ఉపయోగించే పరికరాలను స్వాధీనం చేసుకున్నాం

- సెంథిల్ కుమార్, చిత్తూరు జిల్లా ఎస్పీ

ABOUT THE AUTHOR

...view details