ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తిరుపతిలో ఘనంగా 'పోలీస్ డ్యూటీమీట్' ప్రారంభం - తిరుపతిలో 'పోలీస్ డ్యూటీమీట్' ప్రారంభం

రాష్ట్ర పోలీస్‌ డ్యూటీ మీట్‌ ఘనంగా తిరుపతిలో ప్రారంభమైంది. ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి, డీజీపీ గౌతం సవాంగ్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. 'ఇగ్నైట్‌' అనే పేరుతో నిర్వహిస్తున్న ఈ మీట్ 4 రోజుల పాటు సాగనుంది.

tirupathi police meet taza
tirupathi police meet taza

By

Published : Jan 4, 2021, 10:36 AM IST

Updated : Jan 4, 2021, 12:56 PM IST

తిరుపతిలో ఘనంగా ప్రారంభమైన 'పోలీస్ డ్యూటీమీట్'

తిరుపతి పోలీస్‌ పరేడ్‌ మైదానం, కల్యాణి డ్యాం పోలీస్‌ శిక్షణా కళాశాల వేదికగా రాష్ట్ర పోలీస్‌ డ్యూటీ మీట్​ను‌ ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి, డీజీపీ గౌతం సవాంగ్ ప్రారంభించారు. 'ఇగ్నైట్‌' అనే పేరుతో 4 రోజులపాటు స్టేట్‌ పోలీస్‌ డ్యూటీమీట్‌ నిర్వహించనున్నారు. రాష్ట్ర విభజన తర్వాత తొలిసారి జరుగుతున్న ఈ వేడుకలను.. జాతీయస్థాయి ప్రమాణాలతో జరపుతున్నారు. పోలీస్‌ శాఖ శక్తియుక్తులు చాటిచెప్పేలా.. 18 విభాగాల్లో 22 పోటీలు నిర్వహించనున్నారు. ఇందుకోసం 13 జిల్లాల నుంచి 450 మంది సిబ్బంది తిరుపతి తరలివచ్చారు.

కంప్యూటర్‌ అవగాహన, డాగ్‌స్క్వాడ్‌, ఫోటోగ్రఫీ, పొట్రేట్‌ పార్లే, ఫింగర్‌ ప్రింట్‌, IO ఫోటోగ్రఫీ విభాగాల్లో పోటీలు నిర్వహించనున్నారు. జిల్లా పోలీస్‌ పరేడ్‌ మైదానంలో ప్రధాన కార్యక్రమాలు, ప్రత్యేక సమావేశాలు, సదస్సులు జరుగుతాయి. కొవిడ్ సమయంలో.. పోలీసులు వెనకడుగు వేయకుండా గొప్ప సేవలు అదించారని.. ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి కొనియాడారు. ప్రజా శ్రేయస్సే లక్ష్యంగా.. ప్రాణాలు లెక్కచేయకుండా విధులు నిర్వర్తించారన్నారు.

ఇదీ చదవండి:తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి, దివాకర్ రెడ్డి గృహనిర్బంధం

Last Updated : Jan 4, 2021, 12:56 PM IST

ABOUT THE AUTHOR

...view details