చిత్తూరు జిల్లా మదనపల్లె టమాటా మార్కెట్ సందర్శనకు పోలీసుల అనుమతి నిరాకరణపై జనసేన అధ్యక్షుడు పవన్ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. మదనపల్లెలో పార్టీ కార్యకర్తల భేటీలో మాట్లాడిన ఆయన... రైతులను కలిసి మాట్లాడేందుకు అనుమతి ఇవ్వకపోయినా... రోడ్డుపై కూర్చొని మాట్లాడతానన్నారు.
మదనపల్లెలో మాట్లాడుతున్న పవన్ " వైకాపా నాయకులు దౌర్జన్యం చేస్తే భయపడే రకం కాదు నేను. మీరు అనుమతి ఇవ్వనంటే... పారిపోయే రకం కాదు. నా రాయలసీమ పర్యటనను ఎవరూ ఆపలేరు. టమాటా మార్కెట్‌కు రేపు వెళ్లి తీరుతా.. ఏ వైకాపా ఎమ్మెల్యే ఆపుతారో నేనూ చూస్తా.." ... పవన్ కల్యాణ్
ఆంధ్రప్రదేశ్‌ను.. ఇంగ్లిష్ప్రదేశ్గా మార్చేందుకు వైకాపా ప్రయత్నిస్తోందని పవన్ ఆరోపించారు. మాతృభాష మూలాలు తెలిస్తే ఇంగ్లిష్ కూడా బాగా మాట్లాడగలమన్నారు. తెలుగుభాష అన్నా.. మాండలికాలన్నా తనకు చాలా గౌరవమన్నారు. ప్రపంచాన్ని మార్చాలంటే ముందు మనం మారాలని పవన్ అన్నారు. ప్రపంచానికే తత్త్వం నేర్పిన జిడ్డు కృష్ణమూర్తి పుట్టిన నేల మదనపల్లె అన్న పవన్.. రవీంద్రనాధ్ ఠాగూర్ జనగణమన అనువదించిన నేల మదనపల్లె అని గుర్తు చేసుకున్నారు. ఇంతటి గొప్ప సీమను... ఫ్యాక్షన్ సీమగా మార్చేశారన్నారు.
ఇదీ చదవండి :
'అమిత్‌షా అంటే వైకాపా నేతలకు భయం, నాకు గౌరవం'