ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మృతదేహాలపై ఆభరణాలు మాయం... కేసును ఛేదించిన పోలీసులు

తిరుపతిలోని ఓ ఆస్పత్రిలో మృతదేహాల నుంచి ఆభరణాలు మాయం చేసిన కేసును తిరుపతి అర్బన్​ పోలీసులు ఛేదించారు. వాళ్ల నుంచి ఉంగరాలు, ఆరు వేల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ రమేశ్​రెడ్డి తెలిపారు.

Police cracked the case of jewelry theft on the bodies in hospital at tirupati
మృతదేహాలపై ఆభరణాలు మాయం కేసును చేధించిన పోలీసులు

By

Published : Sep 28, 2020, 7:19 PM IST

ఆస్పత్రుల్లో మృతదేహాలపై ఆభరణాలు మాయం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తిరుపతి అర్బన్ ఎస్పీ రమేశ్​రెడ్డి హెచ్చరించారు. ఈ నెల 23న నగరంలోని స్విమ్స్ ఆస్పత్రిలో శవాల నుంచి ఆభరణాలు మాయం చేసిన కేసులో నిందితులను అరెస్ట్ చేసినట్లు మీడియా సమావేశంలో ఆయన వెల్లడించారు.

ఆసుపత్రిలో కరోనాతో చికిత్స పొందుతూ మృతి చెందిన వ్యక్తి నుంచి ఓ వార్డు బాయ్, ఓ నర్సు ఆభరణాలు చోరీ చేశారని అన్నారు. మృతుల బంధువుల ఫిర్యాదుతో విచారణ చేపట్టిన పోలీసులు... వారి ఆభరణాలు మాయం చేస్తున్నట్లు సీసీ కెమెరాల్లో గుర్తించామని అన్నారు. వాళ్లను అదుపులోకి తీసకుని.. నాలుగు బంగారు ఉంగరాలు, ఆరు వేల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నాం అని ఎస్పీ రమేశ్​ రెడ్డి వివరించారు. కనీసం మానవత్వం లేకుండా అలాంటి ఘటనలకు పాల్పడే వారిని ఉపేక్షించేది లేదని... కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details