ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆంధ్ర - తమిళనాడు సరిహద్దులో విస్తృత తనిఖీలు.. గంజాయి స్వాధీనం - నగిరి నియోజకవర్గం

చిత్తూరు జిల్లా నగిరి నియోజకవర్గం ఆంధ్ర- తమిళనాడు సరిహద్దు చెక్ పోస్ట్ వద్ద పోలీసులు తనిఖీలు చేశారు. విశాఖ నుంచి బెంగళూరుకు తరలిస్తున్న గంజాయిని తరలిస్తున్న వారిని అదుపులోకి తీసుకున్నారు. ఒకరు పరారయ్యాడు.

chittor district
పోలీసుల తనికిలలో పట్టుబడ్డ గంజాయి..

By

Published : Jun 30, 2020, 12:26 AM IST

చిత్తూరు జిల్లా నగిరి నియోజకవర్గం విజయపురం మండలం మహారాజ పురం గ్రామం వద్ద ఆంధ్ర- తమిళనాడు సరిహద్దు చెక్ పోస్ట్ వద్ద.. నగిరి పోలీసులు తనిఖీలు చేశారు. బెంగుళూరు వెళ్తున్న కారులో నాలుగు కేజీల 500 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కారులో ఉన్న నలుగురిలో ఓ వ్యక్తి పరారవగా.. మిగతా ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. చిత్తూరు జిల్లా ఎస్పీ సెంథిల్ కుమార్, నగిరి రూరల్ సీఐ... సిబ్బందిని అభినందించారు.

ABOUT THE AUTHOR

...view details