చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిపై కేసు నమోదు - ap politics
వైకాపా అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిపై కేసు నమోదైంది. తనపై హత్యాయత్నం చేశారంటూ తెదేపా అభ్యర్థి నాని భార్య గానసుధ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
గానసుధ
చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గ వైకాపా అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిపై కేసు నమోదైంది. తనపై హత్యాయత్నం చేశారంటూ తెదేపా అభ్యర్థి నాని భార్య గానసుధ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తుమ్మలగుంట పోలింగ్ కేంద్రానికి వెళ్లిన సమయంలో దాడి చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. చెవిరెడ్డి, ఆయన అనుచరులు దాడి చేసి కారు అద్దాలు ధ్వంసం చేశారని, సిబ్బందిని కూడా గాయపరిచారని ఫిర్యాదు చేశారు.