చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం శ్రీనివాస మంగాపురంలో ఎర్రచందనం స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నారు. ఎర్రచందనం ప్రత్యేక కార్యదళం శేషాచల అడవుల్లో కూంబింగ్ నిర్వహిస్తుండగా, శ్రీనివాస మంగాపురం రైల్వే ట్రాక్ సమీపంలో సుమారు 60 మంది ఎర్రచందనం స్మగ్లర్లు తారసపడ్డారు. అధికారులను చూడగానే తమిళ భాషలో వారిని చంపండంటూ అధికారులపై రాళ్ల దాడికి దిగారు. అధికారులు ప్రతిఘటించటంతో 47 మంది పరారవ్వగా,13 మంది స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి 54 ఎర్రచందనం దుంగలు, 2 వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో ఇద్దరు స్థానికులు కాగా, మిగిలిన వారు తమిళనాడుకు చెందినవారు. పారిపోయిన స్మగ్లర్ల కోసం ముమ్మర గాలింపు చర్యలు చేపట్టినట్లు అధికారులు వివరించారు.
దాడి చేసింది 60 మంది... దొరికినవారు 13 మంది - శ్రీనివాస మంగాపురలో ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్టు
ఎర్రచందనం స్మగ్లర్లు ఎదురు తిరగటమే కాకుండా, అధికారులనే చంపండంటూ రాళ్లు రువ్వారు. అటవీ అధికారులు ప్రతిఘటించటంతో కొందరు పరారవ్వగా, కొంతమందిని ప్రత్యేక కార్యదళం అదుపులోకి తీసుకుంది.
![దాడి చేసింది 60 మంది... దొరికినవారు 13 మంది red sandal smugglers arrest in srinivasa mangapuram](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6066120-765-6066120-1581647743527.jpg)
శ్రీనివాస మంగాపురంలో ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్టు
శ్రీనివాస మంగాపురంలో ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్టు
ఇదీ చదవండి:రైస్ పుల్లింగ్ ముఠా గుట్టు ఇలా రట్టు చేశారు