తిరుపతి గ్రామీణ మండలం పుదిపట్ల పంచాయతీలో ఆనందయ్య మందు పంపిణీ సందర్భంగా వాగ్వాదం జరిగింది. కృష్ణపట్నం నుంచి ఔషధాన్ని స్వయంగా తీసుకొచ్చిన సర్పంచ్ సుధా యాదవ్... పంచాయతీలోని ప్రతి ఇంటికీ ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. అయితే అనుమతులు లేవంటూ ఎంఆర్.పల్లి పోలీసులు ఆయనను అడ్డుకున్నారు. చంద్రగిరి నియోజకవర్గమంతటా పంపిణీ జరుగుతోందని తమను మాత్రం అడ్డుకోవడం హాస్యాస్పదమని సర్పంచ్ అన్నారు. ఎన్ని కేసులు పెట్టినా పంపిణీ ఆపేది లేదని స్పష్టం చేశారు.
anandhayya medicine : అనుమతులు లేవని ఆనందయ్య మందు పంపిణీని అడ్డుకున్న పోలీసులు
చిత్తూరు జిల్లా పుదిపట్లలో ఆనందయ్య మందు(anandhayya medicine ) పంపిణీలో స్వల్ప వాగ్వాదం నెలకొంది. కృష్ణపట్నం నుంచి మందు తీసుకొచ్చి సర్పంచ్ పంపిణీ చేస్తుండగా... అనుమతులు లేవంటూ పోలీసులు అడ్డుకున్నారు.
ఆనందయ్య మందు పంపిణీ