ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జిల్లా సరిహద్దులో వలస కార్మికులను అడ్డుకున్నపోలీసులు - migrant workers latest news chittoor

బెంగళూరు నుంచి సొంత రాష్ట్రానికి తిరుగుపయనమైన ఝార్ఖండ్, బిహార్​కు చెందిన వలస కార్మికులు చిత్తూరు జిల్లా చీలికబైలు చెక్​పోస్టుకు చేరుకున్నారు. వారిని అక్కడ పోలీసులు అడ్డుకొని మదనపల్లి తహసీల్దార్​కు సమాచారం ఇచ్చారు.

Police blocking migrant workers at district boundaries at madanpalle
జిల్లా సరిహద్దులో వలస కార్మికులను అడ్డుకున్నపోలీసులు

By

Published : May 22, 2020, 3:48 PM IST

Updated : May 22, 2020, 4:17 PM IST

బెంగళూరు నుంచి స్వగ్రామాలకు తిరుగు పయనమైన వలస కూలీలను ఏపీ పోలీసులు అడ్డుకున్నారు. ఝార్ఖండ్​కు చెందిన 32 మంది, బిహర్​కు చెందిన 145 మంది వలస కూలీలను చిత్తూరు చీలికబైలు చెక్​పోస్టు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. సమాచారాన్ని చిత్తూరు జిల్లా మదనపల్లె తహసీల్దార్ సురేశ్​బాబుకు సమాచారం అందించారు. ఝార్ఖండ్ కు చెందిన 32 మంది కార్మికులను తహసీల్దార్ కార్యాలయానికి తీసుకెళ్లారు. వీరికి ప్రథమ చికిత్స చేయించి సొంత రాష్ట్రానికి పంపనున్నారు. మిగిలిన 145 మంది బిహార్ వలస కూలీలను రాష్ట్ర సరిహద్దులోనే ఉంచారు. వీరిపై అధికారులు ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

ఇదీ చదవండి:తితిదే అనుబంధ కేంద్రాల్లో లడ్డూ ప్రసాదాల విక్రయం

Last Updated : May 22, 2020, 4:17 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details