ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మదనపల్లి జిల్లా కోసం అఖిలపక్షం ఆధ్వర్యంలో బంద్... అడ్డుకున్న పోలీసులు - మదనపల్లి లేటెస్ట్​ అప్​డేట్​

మదనపల్లిని జిల్లా కేంద్రంగా చేయాలని అఖిలపక్షం చేపట్టిన బంద్​ను పోలీసులు అడ్డుకున్నారు. నిరసనకారులను అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అరెస్టులను అఖిలపక్ష నేతలు ఖండించారు. మదనపల్లి జిల్లా కేంద్రంగా ప్రకటించే వరకు ఉద్యమిస్తామని తెలిపారు.

Police block bandh
మదనపల్లిలో అఖిలపక్షం బంద్​

By

Published : Feb 28, 2022, 1:59 PM IST

మదనపల్లిలో అఖిలపక్షం బంద్​

చిత్తూరు జిల్లాలోని మదనపల్లిని జిల్లా కేంద్రంగా చేయాలని... డిమాండ్ చేస్తూ అఖిలపక్షం ఆధ్వర్యంలో నిర్వహించిన బంద్‌ కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు. ఆర్టీసీ బస్టాండ్ వద్ద మాజీ ఎమ్మెల్యే కొమ్మలపాటి రమేశ్‌ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టగా.. వారిని అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

సీపీఎం నేతృత్వంలో బెంగళూరు బస్టాండ్‌ వద్ద నిరసన చేపట్టిన ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రజల అభిప్రాయం తెలపడానికి బంద్‌ నిర్వహిస్తే అరెస్టులు చేయడమేంటని మాజీ ఎమ్మెల్యే రమేశ్‌ మండిపడ్డారు. మదనపల్లి జిల్లా కేంద్రంగా ప్రకటించే వరకు పోరాటం ఆపేది లేదని అఖిలపక్షం నేతలు స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details