fms workers agitation in tirupathi:తిరుపతిలోని తితిదే పరిపాలనా భవనం వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకొంది. ఎఫ్.ఎమ్.ఎస్ విభాగంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని తితిదే ఏర్పాటు చేసిన కార్పొరేషన్‌లో విలీనం చేయాలని కోరుతూ... నిరసన చేపట్టిన కార్మికులను పోలీసులు అరెస్ట్ చేశారు. 14 రోజులుగా తిరుపతిలోని తితిదే పరిపాలనా భవనం ఎదుట కార్మికులు, ఉద్యోగులు ధర్నా చేస్తున్నారు. ఏళ్ళ తరబడి పనిచేస్తున్న తమకు ఉద్యోగ భద్రత లేకుండా పోయిందని... పాదయాత్ర సమయంలో టైంస్కేల్ ఇస్తామన్న హమీని ముఖ్యమంత్రి హోదాలో జగన్ నెరవేర్చాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. పరిపాలనాభవనం ముందు భారీగా మొహరించిన పోలీసులు.. కార్మికుల నిరసనలను అడ్డుకున్నారు. కార్మికులు, పోలీసుల మధ్య తోపులాట చోటుచేసుకొంది. అనంతరం వారిని అరెస్ట్ చేసి పోలీస్ పరేడ్ మైదానానికి తరలించారు. అరెస్ట్‌పై కార్మికులు మండిపడ్డారు
TTD: తితిదే పరిపాలనా భవనం వద్ద ఉద్రిక్తత.. ఎఫ్ఎమ్ఎస్ కార్మికుల అరెస్ట్ - ARREST
fms workers arrest: తిరుపతిలోని తితిదే పరిపాలనా భవనం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. 13 రోజులుగా ఆందోళన చేస్తున్న ఎఫ్.ఎమ్.ఎస్ కార్మికులకు పోలీసులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
తితిదే పరిపాలనా భవనం వద్ద ఉద్రిక్తత
Last Updated : Dec 10, 2021, 8:52 AM IST