నాగాలాండ్ కు చెందిన కొందరు యాత్రికులు సొంత వాహనంలో తిరుమలకు వచ్చారు. అలిపిరిలో తనిఖీ పూర్తయిన తరువాత.. కొండపైకి పయనమయ్యారు. కనుమ దారిలో వస్తున్న సమయంలో కారులో మద్యం సేవిస్తూ వచ్చారు. గమనించిన ఇతర భక్తులు అక్కడి సిబ్బందికి సమాచారం ఇచ్చారు.
జీఎన్సీ టోల్‌గేట్ వద్ద వాహనాన్ని ఆపి సిబ్బంది తనిఖీ చేశారు. కారులోని మద్యం సీసా, గుట్కా ప్యాకెట్లును గుర్తించి.. వాటిని స్వాధీనం చేసుకున్నారు. నిషేధిత వస్తువులతో భద్రతా సిబ్బంది కళ్లుగప్పి.. కొండపైకి రావడంతో వారిని అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు.