చిత్తూరు-తచ్చురు జాతీయ రహదారిలో భూములు కోల్పోతున్న రైతులకు పరిహారం పెంచాలని కోరుతూ ధర్నా చేస్తున్నసీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణను పోలీసులు అరెస్టు చేశారు. చిత్తూరులోని కలెక్టరేట్ ఎదుట రైతులు నిరసన దీక్ష చేపట్టారు. రైతులకు మద్దతుగా సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమం ఉద్రిక్తతకు దారి తీసింది. భూనిర్వాసితుల నుంచి వినతులను స్వీకరించేందుకు కార్యాలయంలో ఉన్న జిల్లా కలెక్టర్ బయటకు రాకపోవడంతో..రైతన్నలు కలెక్టరేట్‌ను ముట్టడించేందుకు యత్నించారు. వీరిని పోలీసులు అడ్డుకోవడంతో.. రైతులు బెంగళూరు-చెన్నై జాతీయ రహదారిపై బైఠాయించి కలెక్టర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
చిత్తూరు కలెక్టరేట్ దగ్గర భూనిర్వాసితుల ధర్నా.. సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అరెస్టు - cpi narayana arrest news
చిత్తూరు కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. భూ నిర్వాసితులకు మద్దతుగా ధర్నా చేస్తున్న సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణను పోలీసులు అరెస్టు చేశారు. భూనిర్వాసితుల నుంచి వినతులను స్వీకరించేందుకు కలెక్టర్ బయటికి రాకపోవడంతో ...రైతన్నలు కలెక్టరేట్‌ను ముట్టడించే ప్రయత్నం చేశారు. చిత్తూరు-తచ్చూరు జాతీయ రహదారిలో భూములు కోల్పోతున్న రైతులకు పరిహారం పెంచాలని కోరుతూ రైతులు చేస్తున్న దీక్షకు మద్దతు తెలుపుతూ..ఆయన ధర్నాలో కూర్చున్నారు.
సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అరెస్టు!
తమకు పరిహారం చెల్లించడంలో అన్యాయం చేస్తున్నారని.. పలుమార్లు కలెక్టర్‌కు వినతి చేసినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణను అరెస్టు చేసేందుకు పోలీసులు ప్రయత్నించడంతో రైతులు అడ్డుకున్నారు. పోలీసులు భారీ ఎత్తున బలగాలను మోహరించి నారాయణతో పాటు..రైతన్నలను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
ఇదీ చూడండి.Vishaka steel plant: స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై పునరాలోచన లేదు: కేంద్రం