హైటెక్ వ్యభిచార ముఠాను తిరుపతి తూర్పు పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు. నగరంలోని శ్రీనగర్ కాలనీలో వ్యభిచార గృహాన్ని నిర్వహిస్తున్నట్లు సమాచారంతో పోలీసులు దాడి చేశారు. సామాజిక మాధ్యమాల ద్వారా వ్యక్తులను ఆకర్షించించి వ్యభిచారం నిర్వహిస్తున్న సాయి చరణ్, అనిరుద్తో పాటు బళ్లారికి చెందిన స్వప్న, లక్ష్మి ప్రియను పోలీసులు అరెస్ట్ చేశారు. బెంగళూరు, గుడివాడ నుంచి యువతులను తిరుపతికి తీసుకువచ్చి వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నలుగురిపై కేసు నమోదు చేసినట్లు తిరుపతి తూర్పు పట్టణ పోలీస్ సీఐ శివప్రసాద్ రెడ్డి తెలిపారు.
తిరుపతిలో హైటెక్ వ్యభిచారం గుట్టురట్టు - Tirupati updates
సామాజిక మాధ్యమాల్లో అందమైన యువతుల ఫొటోలు పంపి యువకులను ఆకర్షిస్తారు. బెంగళూరు, కృష్ణా జిల్లా నుంచి యువతులను తీసుకువచ్చి... గుట్టు చప్పడు కాకుండా హైటెక్ వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాను తిరుపతి పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనలో నలుగురిపై కేసు నమోదు చేశామన్నారు.
తిరుపతిలో హైటెక్ వ్యభిచారం గుట్టురట్టు