'సేఫ్ అండ్ సెక్యూర్' ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఒక్కొక్కరి నుంచి 12 వేలు డిపాజిట్లు సేకరించిన మోసగాడు రూపేశ్ను చిత్తూరు జిల్లా పెద్ద మండ్యంలో పోలీసులు అరెస్ట్ చేశారు. నెలనెలా 2,900 పింఛన్ ఇస్తానంటూ ప్రజలను నమ్మబలికి పెద్ద మెుత్తంలో డిపాజిట్లు సేకరించిన రూపేశ్.. గతేడాది అగస్టులో తన తండ్రి చంద్రప్పతో కలిసి డబ్బుతో పారిపోయాడు. బాధితుల ఫిర్యాదుతో గతేడాది నవంబర్లో రూపేశ్ తండ్రి చంద్రప్పను పోలీసులు అరెస్ట్ చేశారు. పెద్ద మండ్యం మండలం చెరువు కిందపల్లి వద్ద రూపేశ్ను గమనించిన పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. తండ్రి చంద్రప్ప నుంచి 6 లక్షలు, రూపేశ్ నుంచి 15 లక్షల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు వివరాలను మదనపల్లె డీఎస్పీ రవి మనోహరాచారి వెల్లడించారు.
ఘరానా మోసగాడిని అరెస్ట్ చేసిన పోలీసులు
నెలనెల పింఛన్ ఇప్పిస్తానంటూ పెద్ద ఎత్తున డిపాజిట్లు సేకరించి... పరారైన ఘరానా మోసగాడిని పెద్ద మండ్యం పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు కేసు వివరాలను మదనపల్లె డీఎస్పీ రవి మనోహరాచారి వెల్లడించారు.
ఘరానా మోసగాడిని అరెస్ట్ చేసిన పోలీసులు