ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జంట హత్యల కేసు: నిందితులను తిరుపతికి తరలించేందుకు ప్రయత్నాలు - madanapalle incident news

మూఢ నమ్మకాలతో కన్నకూతుళ్లును తల్లిదండ్రులు కిరాతంగా హత్య చేసిన కేసుపై పోలీసుల విచారణ కొనసాగుతోంది. నిందితులకు వైద్య చికిత్స అందించేందుకు మదనపల్లె సబ్ జైలు నుంచి తిరుపతికి తరలించాలని పోలీసులు భావిస్తున్నారు. ఈ మేరకు న్యాయమూర్తి అనుమతి కోరారు.

madanapalle incident
madanapalle incident

By

Published : Jan 27, 2021, 2:18 PM IST

చిత్తూరు జిల్లా మదనపల్లె జంట హత్యల కేసులో నిందితులను తిరుపతికి తరలించాలని పోలీసులు యోచిస్తున్నారు. మదనపల్లె సబ్ జైలులో బుధవారం నిందితులను పరీక్షించిన వైద్యులు... వారిని రుయా ఆసుపత్రికి తరలించాలని సిఫారసు చేశారు.

మరోవైపు నిందితులు పద్మజ, పురుషోత్తం మంగళవారం ఆహారం ముట్టలేదని... ఇవాళ ఉదయం అల్పాహారం తీసుకున్నారని సబ్ జైలు సూపరింటెండెంట్ రామకృష్ణ యాదవ్ తెలిపారు. ఆ ఇద్దరి ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా తరలింపు కోరుతూ న్యాయమూర్తి అనుమతి కోరామన్నారు.

ABOUT THE AUTHOR

...view details