శ్రీవేంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయ స్నాతకోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చిన గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ను శ్రీపద్మావతి అతిథి గృహంలో భాజపా నాయకులు కలిశారు. హథీరాంజీ భూముల వ్యవహారంపై ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. దీనిపై పూర్తి బాధ్యతలు తితిదే ఈవోకే అప్పగించాలని కోరుతూ భాజపా రాష్ట్ర కార్యదర్శి భాను ప్రకాష్ గవర్నర్‌కు వినతి పత్రం ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే... మఠం వ్యవహారాలు శ్రీకాళహస్తి ఈవోకి అప్పగించిందన్న భాను ప్రకాష్... భూములను అన్యాక్రాంతం కాకుండా న్యాయ విచారణ జరిపించాలని కోరారు. ఈ విషయమై రాష్ట్ర గవర్నర్ సానుకూలంగా స్పందించారని ఆయన తెలిపారు.
హాథీరాంజీ భూముల వ్యవహారంపై గవర్నర్‌కు భాజపా ఫిర్యాదు - latest news of governor
తిరుపతి హథీరాంజీ మఠం భూముల వ్యవహారంపై ప్రభుత్వ నిర్ణయాన్ని పరిశీలించాలని కోరుతూ... భాజపా నాయకులు రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌కు వినతిపత్రం అందించారు. భూములు అన్యాక్రాంతం కాకుండా న్యాయ విచారణ జరిపించాలని కోరారు.
హాథీరాంజీ వ్యవహారంపై గవర్నరుకు వినతిపత్రం ఇచ్చిన భాజపా నాయకులు
TAGGED:
latest news of governor