తిరుమలలో తితిదే అదనపు ఈవో ధర్మారెడ్డి కార్యాలయం వద్ద భక్తుల ఆందోళన చేపట్టారు. సిఫార్సు లేఖలు తీకుకోవాలంటూ అదనపు ఈవో కార్యాలయం వద్ద రోడ్డుపై బైఠాయించారు. తమకు దర్శన టికెట్లు కేటాయించి... స్వామివారి దర్శనం కల్పించాలని నినాదాలు చేశారు. రేవు ఉదయం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనంలో భాగంగా ఆలయ శుద్ధి కార్యక్రమం ఉందని.. సిఫార్సు లేఖలపై దర్శనాలు కేటాయించలేమని తితిదే భక్తులకు నచ్చచెప్పే ప్రయత్నం చేసింది. ఆలయ శుద్ధి కారణంగా రేపు ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం వరకు దర్శనాలు నిలిపి వేస్తామని ప్రకటించింది.
తిరుమలలో సాధారణ భక్తులకు దర్శనం కల్పించేలా చర్యలు తీసుకోవాలని భాజపా నేత భానుప్రకాశ్‌రెడ్డి కోరారు. ప్రత్యేక ప్రవేశదర్శనంతోపాటు ఉచిత సర్వదర్శనం టోకెన్లు జారీచేయాలని డిమాండ్ చేశారు. శ్రీవారి దర్శనానికై సాధారణ భక్తులు ఇబ్బందిపడుతున్నారని అన్నారు.