వేసవి సెలవులు ముగుస్తున్నందున తిరుమళేశుని దర్శనానికి భక్తులు తండోప తండాలుగా తరలి వస్తున్నారు. కొన్ని రోజుల నుంచి రద్దీ క్రమంగా పెరుగుతూ వస్తోంది. శనివారం సాయంత్రానికి రద్దీ మరింత పెరిగింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 32 కంపార్ట్‌మెట్లు పూర్తిగా నిండిపోయాయి. వైకుంఠం వెలుపల దాదావు 3 కిలోమీటర్లకు పైగా క్యూలైను లేపాక్షీ కూడలి వరకు చేరింది.
యాత్రికులు ఉదయం నుంచి అర్థరాత్రి వరకు క్యూలో నిల్చోని నిరీక్షించాల్సి వచ్చింది. సమయానికి అన్నపానీయాలు అందక, క్యూలైన్లలో ఫ్యాన్‌లు లేక ఉక్కపోతతలో అల్లాడిపోయారు. చంటి పిల్లలు, వృద్ధుల పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. 10 గంటల సమయం వేచి ఉన్నప్పటికీ క్యూలైను ఎంతకీ ముందుకు సాగక ఆనేక మంది దర్శనంకు వెళ్లకుండా వరుసల్లో నుంచి వెలుపలికి వచ్చేశారు. అగ్రహించిన భక్తులు తితిదేకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. త్వరగా దర్శనం కల్పించాలంటూ ఆందోళనకు దిగారు.