ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

శ్రీవారి టికెట్లు ఇప్పిస్తానంటూ మోసం చేసిన దళారీపై కేసు నమోదు - తిరుమలలో హైదరాబాద్​ భక్తులు

శ్రీవారి వీఐపీ టికెట్లు ఇప్పిస్తానని మోసం చేసిన దళారీపై తిరుమల పోలీసులు కేసు పెట్టారు. నిందితుడు హైదరాబాద్​కు చెందిన భక్తులనుంచి 15 వేలకు పైగా డబ్బులు వసూలు చేశాడు.

piligrims complaint on broker at tirumala
శ్రీవారి టికెట్లు ఇప్పిస్తానంటూ మోసం చేసిన దళారీపై కేసు నమోదు

By

Published : Feb 3, 2021, 5:00 PM IST

భక్తులను మోసగించిన దళారీపై తిరుమల పోలీసులు కేసు నమోదు చేశారు. హైదరాబాదుకు చెందిన ఎనిమిది మంది భక్తులు శ్రీవారి దర్శనం టిక్కెట్లు కోసం దళారి రాంభూపాల్‌ రెడ్డిని సంప్రదించారు. ఎనిమిది వీఐపీ టిక్కెట్లు ఇప్పిస్తానంటూ వారి వద్ద 15వేల 800 రూపాయలను ఆన్‌లైన్‌ ద్వారా తన ఖాతాకు జమచేయించుకున్నాడు. దళారి మాటలను నమ్మిన మధుసూదన్‌ అనే భక్తుడు కుటుంబ సభ్యులతో కలసి తిరుపతికి చేరుకున్నారు.

రాంభూపాల్‌ రెడ్డికి ఫోన్‌ చేయగా అలిపిరిలోనే ఉండమని కోరాడు. ఎంతసేపటికి రాకపోవడంతో ఆగ్రహించిన భక్తులు దళారీని నిలదీయగా అతని వద్దనుంచి సమాధానం రాలేదు. మోసపోయామని గ్రహించిన యాత్రికులు తితిదే విజిలెన్స్‌ కు ఫిర్యాదు చేశారు. ప్రాథమిక విచారణ చేసిన విజిలెన్స్‌ తిరుమల రెండవ పట్టణ పోలీసులకు కేసును అప్పగించారు.

ఇదీ చూడండి:'ఎన్నికలు ప్రశాంతంగా జరగడం ముఖ్యమంత్రికి ఇష్టం లేదు'

ABOUT THE AUTHOR

...view details