శనివారం కావటంతో తిరుమల శ్రీవారి దర్శనం కోసం భక్తులు భారీగా తరలివచ్చారు. అలిపిరి కాలినడక మార్గం భక్తులతో కిటకిటలాడింది. కరోనా మహమ్మారి పరిస్థితుల తర్వాత దశల వారీగా టోకెన్లను పెంచుతూ వస్తున్న తితిదే... ప్రస్తుతం పూర్తిస్థాయిలో సర్వదర్శనం టోకెన్లను అందిస్తోంది.
తిరుమలలో భక్తుల రద్దీ.. పూర్తిస్థాయిలో సర్వదర్శనం టోకెన్లు - తిరుమల తాజా వార్తలు
తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. స్వామివారి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. ప్రస్తుతం పూర్తిస్థాయిలో సర్వదర్శనం టోకెన్లను తితిదే అందిస్తోంది.
తిరుమలలో భక్తుల రద్దీ
ఉదయం 6 నుంచి 2 గంటలకు అలిపిరికి, ఉదయం 6 నుంచి సాయంత్రం 4 గంటల వరకూ శ్రీవారి మెట్టు మార్గం నుంచి కాలినడకన తిరుమల చేరుకునేందుకు తితిదే అనుమతిస్తుండటంతో భక్తులు పెద్దఎత్తున తరలివస్తున్నారు.
ఇదీ చూడండి.తిరుమల శ్రీవారికి.. తితిదే పాలక మండలి సభ్యుడు భారీ విరాళం