ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పీలేరులో ఎల్లమ్మ గుడి ధ్వంసం - పీలేరులో ఎల్లమ్మ గుడి ధ్వంసం న్యూస్

చిత్తూరు జిల్లా పీలేరు మండలం.. దొడ్డిపల్లె పంచాయతీ పరిధిలోని పింఛా నది ఒడ్డున.. ఓ ఆలయాన్ని దుండగులు ధ్వంసం చేశారు. చెన్నకేశవస్వామి ఆలయ సమీపంలోని మూలస్థాన ఎల్లమ్మ గుడిపై దాడి చేశారు. పోలీసులు విచారణ చేస్తున్నారు.

పీలేరులో ఎల్లమ్మ గుడి ధ్వంసం
పీలేరులో ఎల్లమ్మ గుడి ధ్వంసం

By

Published : Jan 28, 2021, 8:07 AM IST

దొడ్డిపల్లె పంచాయతీ పరిధి పింఛా నది ఒడ్డున 2019లో మూలస్థాన ఎల్లమ్మ పేరుతో చిన్న గుడి నిర్మించారు. ఆదివారం అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు గుడిని ధ్వంసం చేశారు. సోమవారం ఉదయం గుర్తించిన నిర్వాహకులు భాజపా నాయకుల చొరవతో.. బుధవారం రాతపూర్వకంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఎస్సై తిప్పేస్వామి, గ్రామీణ సీఐ మురళీకృష్ణ, మదనపల్లె డీఎస్పీ రవిమనోహరాచారి సంఘటన స్థలానికి చేరుకొని రెవెన్యూ అధికారులు, స్థానికులను విచారించారు. ఈ స్థలం దొడ్డిపల్లె పంచాయతీ సర్వే నంబరు 212 నది పొరంబోకు స్థలంగా గుర్తించామని, పక్కనే వ్యవసాయ పొలాలున్నాయని డీఎస్పీ చెప్పారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనను భాజపా రాజంపేట పార్లమెంటరీ స్థానం బాధ్యుడు ఏవీ సుబ్బారెడ్డి ఖండించారు.

ABOUT THE AUTHOR

...view details