పోలీసులు దూషించారంటూ యువకుడు ఆత్మహత్యకు యత్నించిన ఘటన చిత్తూరు జిల్లాలో కలకలం రేపింది. బాధితుని కుటుంబసభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
పోలీసులు తిట్టారనే కారణంతో కురబలకోట మండలం తెట్టు గ్రామానికి చెందిన సుధాకర్ ఆత్మహత్యకు యత్నించాడు. తన పక్క పొలం వ్యక్తి జేసీబీతో మట్టిని తన పొలంలోని వేస్తుండగా సుధాకర్ అడ్డుకున్నాడు. మట్టి వేయొద్దని చెప్పినా వినకపోవటంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. మట్టి వేస్తున్న వ్యక్తిని ఆపకపోగా సుధాకర్‌ను దూషించారని బాధితుని కుటుంబసభ్యులు తెలిపారు. దీంతో మనస్తాపానికి గురైన అతను పురుగులమందు తాగాడు. అతనిని మదనపల్లె ఆసుపత్రికి తరలించారు.