ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ట్రాన్స్​ఫార్మర్ మరమ్మతుకు వెళ్లి మృత్యవాత - Neglect of electrict department officials in Chittoor

విద్యుత్తు నియంత్రిక మరమ్మతుకు వెళ్లి విద్యుదాఘాతంతో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయిన ఘటన చిత్తూరు జిల్లా నారాయణవనం మండలంలో జరిగింది. విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్లే అతను మరణించాడాని గ్రామస్థులు రోడ్డుపై ధర్నా చేపట్టారు.

person died  with electric shock
మరమ్మతుకు వెళ్లి మృత్యవాత

By

Published : Dec 6, 2020, 8:33 PM IST

చిత్తూరు జిల్లా నారాయణవనం మండలం గోవిందప్పనాయుడు కండ్రిగలో విద్యుదాఘాతంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. గ్రామానికి చెందిన బాలాజీ (40)... స్థానిక విద్యుత్ ఉద్యోగితో కలిసి ట్రాన్స్​ఫార్మర్ మరమ్మతు చేయడానికి వెళ్లాడు. సబ్​స్టేషన్​లో ప్రమాదవశాత్తు బాలాజీకి విద్యుదాఘాతం కలిగింది. అతను అక్కడికక్కడే మరణించాడు.

గ్రామస్థుల ధర్నా..

విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్లే బాలాజీ మృతి చెందాడని ఆరోపిస్తూ స్థానికులు రహదారిపై ధర్నా చేపట్టారు. అతని కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు వచ్చి తగిన చర్యలు తీసుకుంటామని, దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

ఇదీ చేయండి:

కుందూ నదిలో మహిళ మృతదేహం వెలికితీత

ABOUT THE AUTHOR

...view details