చిత్తూరు జిల్లా వాల్మీకిపురం మండలం జర్రవారిపల్లెలో ఓ పెళ్లింట విషాదం నెలకొంది. పెళ్లి పనులు చేస్తుండగా విద్యుత్ షాక్తో వధువు అన్నయ్య మృతి చెందాడు. గురుప్రకాష్ పలమనేరు మన గ్రోమోర్ సెంటర్లో పని చేస్తున్నాడు. తన చెల్లెలు వివాహం కోసం వచ్చి... పెళ్లి పనులు చేస్తున్నాడు. ప్రమాదవశాత్తూ కరెంట్ షాక్ తగిలి అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు గురుప్రకాష్ను ఆసుపత్రికి తరలించే లోపు మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని.. మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు.
పెళ్లింట విషాదం...విద్యుత్ షాక్తో వధువు అన్నయ్య మృతి - recent current shock died in jarravaripalle
మరికొన్ని గంటల్లో చెల్లి పెళ్లి... ఇళ్లంతా బంధువులతో సందడిగా ఉంది. అందరూ వివాహ సంబరాల్లో ఉన్న సమయంలో... వధువు అన్నయ్య విద్యుదాఘాతంతో మృతి చెందాడు. సందడిగా ఉన్న ఇంట్లో ఒక్కసారిగా విషాదం నెలకొంది.
కరెంట్ షాక్తో వధువు అన్న మృతి