ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విద్యుత్ తీగలు తగలి ఒకరు మృతి... మరో ఇద్దరికి గాయాలు - చిత్తూరు జిల్లా నేర వార్తలు

అడవిపందుల కోసం ఏర్పాటు చేసిన విద్యుత్ తీగలు తగిలి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన చిత్తూరు జిల్లా కొట్రకోన అటవీ ప్రాంతంలో జరిగింది. పోలీసులు వివరాలను సేకరిస్తున్నారు.

మృతి చెందిన బాలకృష్ణ
మృతి చెందిన బాలకృష్ణ

By

Published : Feb 1, 2021, 7:53 AM IST

చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు పరిధిలో... అడవి పందుల కోసం ఏర్పాటు చేసిన విద్యుత్ తీగలు తగిలి బాలకృష్ణ అనే వ్యక్తి మృతి చెందాడు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. సదుం మండలానికి చెందిన బాలకృష్ణ.. తన భార్య, తమ్ముడితో కలిసి కొట్రకోన అడవి సమీపంలో మామిడి తోటకు కాపలాగా ఉంటున్నారు.

అడవి పందుల కోసం ఏర్పాటు చేసిన విద్యుత్ తీగలు ప్రమాదవశాత్తూ తగిలి బాలకృష్ణ అక్కడికక్కడే మృతిచెందాడు. అతని భార్య, తమ్ముడు గాయాలపాలయ్యారు. ప్రస్తుతం వారిద్దరూ చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details