శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక నర్సింగ్ కళాశాలపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేయడంతో పాటు.. కళాశాల ప్రిన్సిపల్ను కులం పేరుతో దూషించిన యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తికి చెందిన వినీష్ (27) కొంతకాలంగా నర్సింగ్ కళాశాలపై సోషల్ మీడియలో తప్పుడు ప్రచారం చేశాడు. ఈ విషయమై ప్రిన్సిపల్ మందలించడంతో.. కులం పేరుతో దూషించినట్లు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. విచారణ జరిపి.. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు సీఐ శ్రీనివాసులు తెలిపారు.
కళాశాలపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం.. యువకుడు అరెస్ట్ - శ్రీకాళహస్తిలో కళాశాలపై సోషల్ మీడియాలో యువకుడి దుష్ప్రచారం
చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలోని.. ఓ యువకుడు శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక నర్సింగ్ కళాశాలపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేశాడు. ఈ ఘటనపై.. కళాశాల ప్రిన్సిపాల్ మందలించడంతో.. కులం పేరుతో దూషించగా.. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. విచారణ జరిపి.. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు.

person arrested for bad publicity
TAGGED:
chittor latest news