కరోనా వ్యాప్తి చెందకుండా రాష్ట్రంలో లాక్ డౌన్ కొనసాగుతున్న వేళ... నిత్యావసర వస్తువుల కొనుగోలుకు ప్రజలు భారీగా వస్తున్నారు. పీలేరు నియోజకవర్గం పరిధిలోని ఆరు మండలాల్లో అధికారులు నిత్యావసర సరకుల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. మార్కెట్లకు పెద్ద ఎత్తున జనం వస్తున్నందున రద్దీ నెలకొంది. కలికిరి కొనుగోలు కేంద్రంలో ప్రజలు సామాజిక దూరాన్ని పాటించకుండా దగ్గరదగ్గర నిలబడ్డారు. ఇలాంటి చర్యల వల్ల కరోనా వేగంగా వ్యాపిస్తుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కరోనా వ్యాపిస్తుండగా ... నిర్లక్ష్యమేలా..? - rush in kalikiri market
దేశ వ్యాప్తంగా లాక్డౌన్ కొనసాగుతోంది. ప్రజలు నిత్యావసర వస్తువులను కొనుగోలు చేసేందుకు భారీగా తరలి వస్తున్నారు. చిత్తూరు జిల్లాలోని పీలేరు నియోజకవర్గంలో కొనుగోలుదారులతో మార్కెట్ రద్దీగా మారింది. కనీస జాగ్రత్తలు పాటించకుండా ప్రజలు రావడంతో అధికారులు ఆందోళనకు గురయ్యారు.
నిత్యావసర వస్తువుల కొనుగోలుకు భారీగా వచ్చిన జనం