చిత్తూరు జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య పెరుగుతుండటం అన్ని ప్రాంతాల్లో లాక్డౌన్ కట్టు దిట్టంగా అమలు చేస్తున్నారు. జిల్లాలో 24 గంటల్లో 630 పాజిటివ్ కేసులు నమోదు కావడం.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6569కి చేరుకొంది. శుక్రవారం కరోనాతో ఒకరు ప్రాణాలు కోల్పోగా... మృతుల సంఖ్య 68కి చేరుకుంది. జిల్లా వ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండటం చిన్నపాటి లక్షణాలున్నా కరోనా పరీక్షల కోసం ప్రజలు భారీగా తరలివస్తున్నారు. తిరుపతిలో రుయా, ప్రసూతి వైద్యశాలల వద్ద ప్రజలు బారులు తీరడం.. తొక్కిసలాట చోటు చేసుకుంటుంది.
కరోనా పరీక్షల నిమిత్తం.. బారులు తీరుతున్న తిరుపతి జనం - corona test latest news update
రోజు రోజుకు పెరిగిపోతున్న కేసులు చిత్తూరు జిల్లాలో వైరస్ వ్యాప్తిని స్పష్టం చేస్తున్నాయి. దీంతో వైద్యశాలల వద్ద పరీక్షల నిమిత్తం ప్రజలు బారులు తీరుతున్నారు. జిల్లాలోని వివిధ ఆస్పత్రుల్లో ఇప్పటివరకు 3581 మంది కరోనా మహమ్మారి నుంచి కోలుకోగా.. 2920 యాక్టివ్ కేసులకు చికిత్స అందిస్తున్నారు.
కరోనా పరీక్షల నిమిత్తం బారులు తీరుతున్న తిరుపతి జనం