చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో ఇవాళ ఒక్కరోజే 273 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అయినప్పటికీ ప్రజల ప్రవర్తనలో మార్పు రావడం లేదు. స్థానిక కూరగాయల మార్కెట్లో భౌతిక దూరం పాటించకుండా, మాస్కులు ధరించకుండా కూరగాయలు కొనుగోలు చేశారు. కరోనా కట్టడికి ప్రజల సహకారం తప్పనిసరి అని అధికారులు చెబుతున్నా.. వాటిని పట్టించుకోవడం లేదు. ఫలితంగా కరోనా కేసులు సంఖ్య పెరుగుతుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
చంద్రగిరి మార్కెట్లో కనిపించని భౌతిక దూరం - corona cases in chithore district
చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. అయినప్పటికీ ప్రజల్లో మార్పు రావడం లేదు. భౌతిక దూరం పాటించకపోవడం, మాస్కులు ధరించకపోవడంతో వైరస్ వ్యాప్తి పెరుగుతుందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.
చంద్రగిరి మార్కెట్లో కనిపించని భౌతిక దూరం