woman to hospital on bed: చిత్తూరు జిల్లాలోని నాగలాపురం గ్రామాన్ని పిచ్చాటూరు మండలంలోని పదిహేను గ్రామాలతో అనుసంధానించే ద్వారకా నగర్ వంతెన ఇటీవల వరదలకు పూర్తిగా కొట్టుకుపోయింది. దీంతో నాగలాపురానికి రావడానికి ఆయా గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాలినడకన మాత్రమే వచ్చే అవకాశం ఉన్నా శుక్రవారం కురిసిన వర్షానికి అరణియార్ ప్రాజెక్టులోని నీటిని దిగువకు విడుదల చేయటంతో ఆ ఆసరా సైతం ప్రమాదకరంగా మారింది.
ద్వారకానగర్‌కు చెందిన వృద్ధురాలు ప్రాణాపాయ స్థితిలో ఉండటంతో శుక్రవారం బంధువులు ఆమెను మంచంపై ఉంచి వంతెన పక్కన ఉన్న పొదల్లో కాలినడకన మరో ఒడ్డుకు తీసుకువచ్చి నాగలాపురానికి తరలించి ఆస్పత్రిలో చేర్చాల్సి వచ్చింది.