ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పారకాల్వలో ఈగల బెడద.. పట్టించుకోని అధికారులు - పారకాల్వలో ఈగల బెడద.. పట్టించుకోని అధికారులు

సాధారణంగా మన ఇంట్లో ఒక ఈగ కనిపిస్తేనే దాన్ని పారదోలే వరకు ఊరుకోం. అదే మనం భోజనం చేసేటప్పుడు మన సమీపంలోకి వస్తేనే చిర్రెక్కిపోతాం కదా... కాని ఆ గ్రామంలో ఎటుచూసినా ఈగలే. రోడ్లు, ఇళ్లు, ఇలా ప్రతిచోటు ఈగలతో నిండిపోయాయి. ఫలితంగా వాళ్లు ప్రశాంతంగా తినలేరు.. ఉండలేరు. ఆ పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పనక్కర్లేదు. వ్యాధులతో ఇబ్బందులు.. అధికారులకు చెబితే పట్టించుకోరు మరోవైపు... ఇదీ చిత్తూరు జిల్లా పారకాల్వ గ్రామస్థుల దీనస్థితి.

people facing problem with flies at parakalva village Chittoor district
పారకాల్వలో ఈగల బెడద.. పట్టించుకోని అధికారులు !

By

Published : Oct 5, 2020, 8:09 PM IST

Updated : Oct 6, 2020, 9:46 AM IST

చిత్తూరు జిల్లా రామచంద్రాపురం మండలం పారకాల్వ గ్రామంలోని ప్రజలు ఈగల బెడదతో తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ప్రజలు ఈగల ద్వారా వచ్చే వ్యాధులతో నానా అవస్థలు పడుతున్నారు. ఎన్ని మందులు చల్లినా వాటి నుంచి విముక్తి లభించడం లేదని వాపోతున్నారు. అధికారులకు ఇప్పటికే పలుమార్లు ఫిర్యాదు చేశామని వారి నుంచి ఇప్పటికి స్పందన లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఈగల వల్ల పిల్లలు, పెద్దలు జ్వరాల బారిన పడుతున్నారని... ఆనారోగ్యంతో ఆసుపత్రికి వెళ్లితే కరోనా పరీక్షలు చేసుకున్నాకే రమ్మంటున్నారని వాళ్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫలితంగా జీవననే అందోళనకరంగా మారిందని పేర్కొన్నారు.

అదే కారణం..

దీనంతటికీ ప్రధాన కారణం ఆ పరిసరాల్లో ఉన్న కోళ్ల ఫారాలే. అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవట్లేదని పారకాల్వ వాసులు పేర్కొన్నారు. గ్రామంలో ఎటుచూసినా ఈగలే అని... ఇక్కడ ఉండలేకపోతున్నామన్నారు. ఇకనైనా అధికారులు స్పందించి ఈ బాధ నుంచి గ్రామ ప్రజలకు విముక్తి కలిగించాలని వేడుకుంటున్నారు.

ఇదీ చూడండి:

అధికారుల నిర్లక్ష్యం : పింఛన్ అందక బాధితుని అవస్థలు

Last Updated : Oct 6, 2020, 9:46 AM IST

ABOUT THE AUTHOR

...view details