సుదీర్ఘ విరామం అనంతరం తిరుమల శ్రీవారి దర్శనాన్ని ప్రారంభిస్తూ తితిదే నిర్వహించిన ట్రయల్‌రన్ విజయవంతమైంది. ఫలితంగా సాధారణ భక్తులను దర్శనానికి అనుమతిస్తూ సర్వ దర్శన టోకెన్లను జారీచేయడంతో తిరుమలలో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. మూడు రోజులుగా స్థానికులు, తితిదే ఉద్యోగులు శ్రీవారిని దర్శించుకొనేందుకు వస్తున్నందున తిరుమాడ వీధుల్లో భక్తజన సంచారం ప్రారంభమైంది. ప్రయోగాత్మకంగా చేపట్టిన దర్శనాల్లో ఒడుదొడుకులు లేనందున.. దర్శనాలకు అనుమతించే భక్తుల సంఖ్యను పెంచేందుకు తితిదే అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
తిరుమల శ్రీవారి దర్శనానికి బారులు తీరిన భక్తులు.. - తిరుమల నేటి వార్తలు
తిరుమలలో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. అన్‌లాక్ 1.0లో భాగంగా ఇచ్చిన సడలింపులతో అధికారులు శ్రీవారి ఆలయాన్ని తెరిచారు. ఫలితంగా దర్శనానికి వస్తోన్న ఉద్యోగులు, స్థానికులతో కొండపై జనసంచారం మొదలైంది. స్వామివారి దర్శనానికి భక్తులు బారులు తీరారు.
గోవింద నామస్మరణలో తిరుమల