ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పోలీసునని యువకుడి బెదిరింపులు.. స్థానికుల దేహశుద్ధి - people attacked young men news in chittor news

పోలీసునని చెప్పి ఓ కుటుంబాన్ని బెదిరించిన యువకుడికి స్థానికులు దేహశుద్ధి చేశారు. అనంతరం నిందితుడిని పోలీసులకు అప్పగించారు. చిత్తూరు జిల్లా కనమనపల్లిలో జరిగిన ఘటన వివరాలివి..!

పోలీసులమని యువకుల బెదిరింపులు.. స్థానికుల దేహశుద్ధి
పోలీసులమని యువకుల బెదిరింపులు.. స్థానికుల దేహశుద్ధి

By

Published : Aug 14, 2020, 6:08 PM IST

చిత్తూరు జిల్లా గుడుపల్లి మండలం కనమనపల్లిలో పోలీసులమని చెప్పి బెదిరింపులకు పాల్పడిన యువకునికి స్థానికులు దేహశుద్ధి చేశారు. స్థానికంగా నివసిస్తున్న ఓ కుటుంబం.. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతోందని కుప్పంనకు చెందిన నలుగురు యువకులు బెదిరించారు. వీరిలో ఒకడిని గుర్తించిన స్థానికులు చెట్టుకు కట్టేసి దేహశుద్ధి చేశారు. అనంతరం నిందితుణ్ని పోలీసులకు అప్పగించారు.

ABOUT THE AUTHOR

...view details