midd night houses cracks : కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం తుగ్గలి గ్రామంలో గత సోమవారం స్థానిక పోస్ట్ ఆఫీస్ వీధిలోని 10 ఇళ్లల్లో ఏకకాలంలో గోడల్లో పగుళ్లు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో బాధితులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు.. ఇలా ప్రతి ఒక్కరూ వచ్చి చూసి వెళ్తున్నారే తప్ప ఎలాంటి పరిష్కారం చూపకపోగా.. అసలు ఈ పరిస్థితి ఎందుకు ఏర్పడిందనే విషయాన్ని స్పష్టంగా ఎవరూ చెప్పకుండా వెళ్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎవ్వరూ, ఏ విషయం చెప్పకపోవడంతో ప్రతి రోజూ బిక్కు బిక్కు మంటూ గడుపుతున్నామని బాధను వ్యక్తం చేస్తున్నారు.
అర్ధరాత్రి గుబులు.. అర్ధరాత్రి సమయంలో ఇళ్లల్లో పగుళ్లు రావడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ఒకే సమయంలో పదిళ్లలో ఇలాంటి పరిస్థితి తలెత్తడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. అంతేకాదు... సిమెంటు రహదారి సైతం పగుళ్లు ఇచ్చింది. పైప్ లైన్లు సైతం దెబ్బ తినడంతో పాటు, తాగునీరు బయటకు చిమ్మడంతో మరింత ఆందోళన చెందుతున్నారు. భూకంపమా లేక మరేదైనా ప్రకృతి వైపరీత్యమో తెలియక గ్రామస్తులు నలిగిపోతున్నారు. కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం తుగ్గలి గ్రామంలో గత సోమవారం స్థానిక పోస్ట్ ఆఫీస్ వీధిలోని 10 ఇళ్లల్లో ఏకకాలంలో గోడల్లో పగుళ్లు ఏర్పడడంతో బాధితులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.