Sri padmavathi Hospital: తమ బిడ్డల గుండె వైద్యానికి చేతుల్లో చిల్లిగవ్వ లేక కాపాడే బాధ్యతను ఆ ఏడుకొండల వాడికే అప్పగించిన వేళ.. తితిదే వారి ప్రాణాలను రక్షిస్తోంది. తితిదే నెలకొల్పిన శ్రీపద్మావతి చిన్నారుల హృదయాలయం పసిబిడ్డలకు వరంగా మారింది. శ్రీవారి పాదాల చెంత ఏర్పాటుచేసిన ఆసుపత్రిలో చిన్నారులకు సాంత్వన చేకూరుతుండటంతో తల్లిదండ్రుల ఆనందం అవధులు దాటుతోంది.
చిన్నిగుండెకు కొండంత అండ... మూడు నెలల్లో 120 శస్త్రచికిత్సలు - Pediatric heart surgery at tirupathi
Sri padmavathi Hospital: తమ బిడ్డల గుండె వైద్యానికి చేతుల్లో చిల్లిగవ్వ లేక కాపాడే బాధ్యతను ఆ ఏడుకొండల వాడికే అప్పగించిన వేళ.. తితిదే వారి ప్రాణాలను రక్షిస్తోంది. తితిదే నెలకొల్పిన శ్రీపద్మావతి చిన్నారుల హృదయాలయం పసిబిడ్డలకు వరంగా మారింది. ఇప్పటివరకు 120కి పైగా ఓపెన్ హార్ట్, బటన్‌హోల్ సర్జరీలు చేసిన వైద్యులు.. మరో ఆరునెలల్లో గుండెమార్పిడి శస్త్రచికిత్సలకూ సిద్ధమవుతున్నారు.

Sri padmavathi Hospital
తితిదే ఆధ్వర్యంలో నడుస్తున్న శ్రీపద్మావతి చిన్నపిల్లల హృదయాలయం నిరుపేదల కుటుంబాల్లో వెలుగులు నింపుతోంది. ఇప్పటివరకు 120కి పైగా ఓపెన్ హార్ట్, బటన్‌హోల్ సర్జరీలు చేసిన వైద్యులు.. మరో ఆరునెలల్లో గుండెమార్పిడి శస్త్రచికిత్సలకూ సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఆ విభాగ వైద్యుల నియామకంతో పాటు.. కావల్సిన పరికరాలనూ సమకూర్చున్నారు. ఇతర సిబ్బందికి శిక్షణ అందిస్తున్నారు.
ఇదీ చదవండి:TTD Assets: తితిదే ఆస్తులకు జియో ఫెన్సింగ్