ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'2 నెలల్లో అందుబాటులోకి పెద్దేరు ప్రాజెక్టు ఉద్యానవనాలు' - పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి తాజా వ్యాఖ్యలు

పెద్దేరు ప్రాజెక్టు ఉద్యానవనాలు.. మరో రెండు నెలల్లో పూర్తి స్థాయిలో పర్యాటకులకు అందుబాటులోకి రానున్నాయని తెలిపారు. పల్లె పల్లెకు ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి పెద్దేరు ప్రాజెక్టును సందర్శించారు.

Pedderu project
పెద్దేరు ప్రాజెక్టు ఉద్యానవనాలు

By

Published : Apr 4, 2021, 3:28 PM IST

చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె మండలంలోని పెద్దేరు ప్రాజెక్టు ఉద్యానవనాలను బాగు చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. మరో రెండు నెలల్లో పూర్తిస్థాయిలో పర్యాటకులకు అందుబాటులోకి రానుందని తెలిపారు. పల్లె పల్లెకు ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి పెద్దేరు ప్రాజెక్టును సందర్శించారు.

అధ్వాన్న స్థితిలో ఉన్న ఉద్యానవనాలను గమనించిన ఎమ్మెల్యే.. వాటిని పునరుద్ధరించే చర్యలను తక్షణమే చేపట్టాలని అధికారులను ఆదేశించారు. స్పందించిన అధికార యంత్రాంగం.. యుద్ధప్రాతిపదికన ఉద్యాననాలను బాగు చేసే పనిలో పడింది. త్వరలో ప్రజలకు అందుబాటులోకి తెచ్చేలా చర్యలు తీసుకుంది.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details