ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నాగులచవితి నాడు తిరుమలలో పెద్దశేష వాహనసేవ - tirumala latest news

నాగుల చవితి సందర్భంగా తిరుమలలో బుధవారం పెద్దశేష వాహన సేవ నిర్వహించనున్నారు. కరోనా కారణంగా పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతిస్తామని తితిదే అధికారులు తెలిపారు.

peddasesha vahana seva
పెద్దశేష వాహనంపై శ్రీనివాసుడు

By

Published : Nov 17, 2020, 4:02 PM IST

నాగుల చవితిని పురస్కరించుకుని బుధవారం తిరుమలలో పెద్ద శేష వాహన సేవను తితిదే నిర్వహించనుంది. రాత్రి 7 నుంచి 8:30 గంటల మధ్య వాహన సేవ జరగనుంది.

మలయప్పస్వామి వారు శ్రీదేవి, భూదేవి సమేతంగా తిరుమాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమివ్వనున్నారు. ప్రతి ఏడాది నాగులచవితి నాడు పెద్దశేష వాహన సేవ నిర్వహించడం ఆనవాయితీ. కరోనా ప్రభావం వల్ల పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతించనున్నారు.

ABOUT THE AUTHOR

...view details