ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

farmers problems: వర్షాలకు మొలకెత్తుతున్న వేరుశెనగ..ఆందోళనలో అన్నదాతలు - వర్షం

ఆరుగాలం కష్టపడి పంట పండిస్తున్న అన్నదాతకి వర్షాలు తీవ్రనష్టాన్ని మిగులుస్తున్నాయి. చిత్తూరు జిల్లా తూర్పు మండలాల్లో వేరుశెనగ పంట వర్షాలకు మొలకలొచ్చింది. ప్రభుత్వం తమను ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు.

peanut crop damage at chittoor district
చిత్తూరు జిల్లాలో వేరుశెనగ పంట నష్టం

By

Published : Jul 15, 2021, 2:17 PM IST

గత వారం రోజులుగా కురుస్తున్న వర్షానికి చిత్తూరు జిల్లా తూర్పు మండలాల్లో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వేరుశెనగను ఆరబెట్టు కునేందుకు అవస్థలు పడుతున్నారు. వర్షానికి కాయలన్నీ పూర్తిస్థాయిలో మొలకెత్తుతున్నాయి. దీంతో ఆరుగాలం శ్రమించి పండించిన వేరుశనగ పంట ... చేతికందే సమయంలో నష్టాలను చవిచూడాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లక్షలు రూపాయలు పెట్టుబడులు పెట్టామని.. వర్షం వల్ల తమ శ్రమ అంతా నీళ్లో కలిసిపోయిందని ఓ రైతు ఆవేదన వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details