ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కేంద్రంలో కాంగ్రెస్​ రాగానే రాష్ట్రానికి ప్రత్యేక హోదా: పీసీసీ చీఫ్ శైలజానాథ్ - congress campaign in tirupati

తిరుపతి ఉపఎన్నికల్లో కాంగ్రెస్​ తరఫున పోటీ చేస్తున్న చింతామోహన్​ కు ఓటు వేయాలంటూ పీసీసీ చీఫ్ శైలజానాథ్​ ప్రచారం చేశారు. తాము కేంద్రంలో రాగానే ఏపీకి ప్రత్యేక హోదా తెస్తామని హామీ ఇచ్చారు.

పీసీసీ చీఫ్ శైలజానాథ్
తిరుపతి ఉపఎన్నికల్లో కాంగ్రెస్ ప్రచారం

By

Published : Apr 12, 2021, 8:26 PM IST

రాహుల్ గాంధీ ప్రధానిగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే...రాష్ట్రానికి ప్రత్యేక హోదాను తీసుకువస్తామని పీసీసీ చీఫ్ శైలజానాథ్​ అన్నారు. తిరుపతిలో నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద ఆయన కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చింతామోహన్ తరఫున ఉపఎన్నిక ప్రచారాన్ని నిర్వహించారు.

భాజపా, వైకాపాలకు తిరుపతి ఉపఎన్నికల్లో ఓటు అడిగే హక్కే లేదని ఆయన అన్నారు. విభజన హామీలను నెరవేర్చటం తమ బాధ్యతగా తీసుకుంటామని శైలజానాథ్ స్పష్టం చేశారు. మన్నవరంలో మూత పడిన బీహెచ్​ఈఎల్​ ఫ్యాక్టరీ సహా మూతపడిపోయిన పరిశ్రమలన్నింటినీ తిరిగి తెరిపిస్తామన్నారు.

ఇదీ చదవండి:అణు కర్మాగారంపై దాడి ఇజ్రాయెల్ పనే: ఇరాన్

ABOUT THE AUTHOR

...view details