ఇదీ చదవండి :
పార్టీని నడపడం కత్తి మీద సాములాంటిది : పవన్ - జనసేన పార్టీ స్థాపనపై పవన్ న్యూస్
రాజకీయాల్లోకి వచ్చాక ఎన్నో ఎదురుదెబ్బలు తగిలాయని... జనసేన అధినేత పవన్ అన్నారు. ఒక పార్టీని నడపేడప్పుడు అనేక సమస్యలు ఎదురవుతాయన్నారు. పార్టీ స్థాపించిన నాటి నుంచి ఎన్నో నిరుత్సాహక సందర్భాలు ఎదురయ్యాయని... తన మనోగతాన్ని బయటపెట్టారు. తిరుపతి న్యాయవాదుల సభలో మాట్లాడిన పవన్... ఎన్ని అవమానాలు ఎదురైనా భవిష్యత్తు తరాల బాగుకోసం కడవరకూ పార్టీని నడిపిస్తానన్నారు. ప్రస్తుతం పార్టీని నడపాలంటే పెద్ద సమస్యగా మారుతుందన్న ఆయన... గ్రూపులు చూసి నిస్సాయకస్థితి కలుగుతుందన్నారు. ఎవరికైనా ఓ పని అప్పజేపితే గ్రూపులు కట్టి అందరు కలిసి రావడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీని నడపడం కత్తి మీద సాములాంటిది : పవన్